బీఎస్పీ మండల అధ్యక్షుడుగా రాజు నియామకం

WGL: బహుజన సమాజ్ పార్టీ స్టేషన్ ఘన్పూర్ మండల అధ్యక్షుడిగా తాటికొండ గ్రామానికి చెందిన నారాబోయిన రాజు నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆయనకు నియామకపు పత్రాన్ని జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ అందచేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. మండలంలోని అన్ని బహుజన కులాలను ఏకంచేసి ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషిచేస్తానని అన్నారు.