VIDEO: కరెంట్ షాక్‌కు మరొకరు మృతి

HYD: నగరంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. తిరుమలగిరిలోని లోతుకుంటలో టెంట్ సామాన్లు తీసివేస్తుండగా కరెంట్ షాక్‌కు గురై ఒకరు(లక్కీ) మరణించగా, మరో ముగ్గురి పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, నగరంలో రోజురోజుకు కరెంట్ షాక్ మరణాలు పెరిగిపోతున్నాయి. గత వారం రోజుల్లోనే 11 మంది విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు.