విద్యార్థులను పరామర్శించిన వైసీపీ ఇంఛార్జ్

విద్యార్థులను పరామర్శించిన  వైసీపీ ఇంఛార్జ్

ప్రకాశం: కనిగిరి మండలం బడుగులేరులో ఇటీవల కలుషిత నీరు వల్ల అనారోగ్యానికి గురైనా విద్యార్థులను శుక్రవారం వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పరామర్శించారు. ఇందులో భాగంగా గ్రామంలో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం కామెర్లు బారిన పడి చికిత్స చేయించుకుంటున్న విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు కోసం 25వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.