VIDEO: ప్రమాదకరంగా వాగుపై వంతెన.. చోద్యం చూస్తున్న అధికారులు
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం- బొత్తల తండా మధ్యలో వాగు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు అంచు కోతకు గురైంది. ఈ మార్గంలో పగలు, రాత్రి ప్రయాణించాలంటే వాహనదారులు, ప్రయాణికులు భయపడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి వాగు ప్రాంతంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.