రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
SKLM: ఇచ్ఛాపురంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బెల్లుపడ గ్రామానికి చెందిన ఉప్పాడ కుమార్ (35) మృతి చెందాడు. బైక్‌పై వస్తున్న కుమార్‌ను ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. తలకు బలమైన గాయం తగలడంతో స్థానికులు చూసే సరికి మృతిచెంది ఉన్నాడని ఎస్సై ముకుందరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.