బస్ షెల్టర్ నిర్మాణానికి భూమి పూజ

JGL: మల్యాల కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ వద్ద బస్ షెల్టర్ నిర్మాణానికి ఇవాళ భూమి పూజ చేశారు. నిత్యం వందల మంది ఇక్కడ బస్సుల కోసం వేచి చూస్తుంటారు. వర్షాకాలం, ఎండాకాలం ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన మల్యాల పీఏసీఎస్ ఛైర్మన్ ముత్యాల రామలింగారెడ్డి తన తండ్రి నారాయణరెడ్డి స్మారకార్థం సొంత ఖర్చులతో బస్ షెల్టర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.