నగరంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

నగరంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

గుంటూరు: నగరంలోని లక్ష్మీపురం మెయిన్ రోడ్, అశోక్ నగర్ ప్రాంతాల్లో బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. రోడ్డు విస్తరణ పనులు, విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వినియోగదారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.