రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

NDL: పట్టణం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా సోమవారం ఉదయం 9:30 గంటలకు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఇవాళ తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.