VIDEO: గ్రామంలో ఉట్టి కొట్టిన చిన్నారులు

NLR: అల్లూరు మండలంలోని నార్త్ మోపూరు గ్రామంలో శనివారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో సాయంత్రం శ్రీరామ మందిరం దగ్గర ఉట్టి మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి చిన్నారులు వచ్చేసి ఈ ఉట్టి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులు ఉట్టి కొట్టడంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొన్నది.