మాజీ మంత్రి బెయిల్ మంజూరు

NLR: జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో బెయిల్ వచ్చింది. కనుపూరు చెరువులో అక్రమంగా గ్రావెల్ తవ్విన కేసులో అయన A1గా ఉన్నారు. ఈ కేసులో ఆయనకు గురువారం బెయిల్ మంజూరు చేస్తూ నాలుగో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. పోలీసుల విచారణకు సహకరించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.