VIDEO: శబరిమలకు వెళ్తున్న భక్తులకు భిక్ష ఏర్పాటు
సత్యసాయి: పెనుకొండ మండలం దుద్దేబండ క్రాస్‌లోని సాయి బాబా ఆలయంలో పడిపూజ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి శబరిమలకు పాదయాత్రగా వెళ్తున్న 350 మంది అయ్యప్ప మాలధారులు, భక్తులకు కురుబవాండ్లపల్లి గ్రామానికి చెందిన వరప్రసాద్ బిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సువర్ణభూమి బృందం అన్నదాతలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శశిభూషణ్ పాల్గొన్నారు.