అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
NGKL: అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి శుక్రవారం అవగాహన కల్పించారు. అగ్నిమాపక శాఖ ఎస్సై చంద్రశేఖర్ సిబ్బందితో కలిసి ఆసుపత్రి ఆవరణలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటిని ఎలా ఆర్పివేయాలి అనే అంశంపై సిబ్బందికి సూచనలు చేశారు.