'క్రికెట్ పోటీలను యువత సద్వినియోగం చేసుకోవాలి'
సిరిసిల్ల: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రికెట్ పోటీలను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. తంగళ్ళపల్లిలోని లక్ష్మీపూర్ రోడ్డు పక్కన గల గ్రౌండ్‌ను మండల అధ్యక్షుడు రాజన్నతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ మాట్లాడుతూ.. ఒక్కో ఎంపీటీసీ పరిధి నుంచి ఒక్కో టీం పాల్గొంటుందన్నారు. విన్నర్ టీంకు రూ. 50 వేలు ప్రైజ్ మనీ అందిస్తామన్నారు.