సర్పంచ్ ఇంటి వద్దే మగ్గుతున్న 'స్వచ్ఛ సంకల్పం'

సర్పంచ్ ఇంటి వద్దే మగ్గుతున్న 'స్వచ్ఛ సంకల్పం'

ASR: హుకుంపేట(మం) ములియపుట్టులో పంచాయతీకి చెందిన చెత్త రిక్షా సర్పంచ్ ఇంటి ఆవరణలో నిరుపయోగంగా తుప్పు పట్టిపోతోంది. వాహనం ఉన్నా వినియోగించకపోవడంతో గ్రామంలో చెత్త సేకరణ పూర్తిగా ఆగిపోయింది. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పారిశుధ్య పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.