VIDEO: రాగి నాణెం మింగిన బాలుడు
MNCL: నాలుగేళ్ళ బాలుడు రాగి నాణెం మింగగా.. ఎండోస్కోపీ ద్వారా బయటకు తీసిన ఘటన మంచిర్యాలలో జరిగింది. గోదావరిఖనికి చెందిన ఆయన్ అనే బాలుడు అనుకోకుండా రాగి నాణెం మింగాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వెంటనే వైద్య పరీక్షలు చేసిన డా. నవీన్ ఎండోస్కోపీ ద్వారా రాగి నాణెం బయటకు తీశారు.