ఎమ్మెల్యేలకు వినతిపత్రం అందజేసిన నేతలు
HNK: కర్ణాటక తరహాలో గొర్ల కాపరులకు రక్షణ చట్టం చేయాలని కోరుతూ పరకాల, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డిలకు గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం నేతలు వినతిపత్రం అందజేశారు. గొల్లకురుమలకు నగదు బదిలీ హామీని వెంటనే అమలు చేయాలని, ప్రతి గ్రామంలో సామూహిక గొర్రెల షెడ్డుల నిర్మాణం చేసి ఇవ్వాలని ఎమ్మెల్యేలను నేతలు కోరారు.