వస్త్ర దుకాణంలో పాము

వస్త్ర దుకాణంలో పాము

KMM: మధిర పురపాలకంలోని ప్రధానవీధిలో విఘ్నేశ్వరాలయం సమీపాన విషసర్పం వస్త్రదుకాణంలోకి ప్రవేశించి గురువారం భయభ్రాంతులకు గురిచేసింది. సమాచారాన్ని అందుకున్న ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం బాధ్యులు దోర్నాల రామకృష్ణ పామును పట్టుకుని సమీపంలోని అటవీప్రాం తంలో వదిలివేశారు. అది అరుదైన చెట్టిరిక పాముగా గుర్తించారు.