VIDEO: అర్హులకు సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే
WNP: ప్రజా పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం పథకాలు అందుతాయని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్(190), సీఎంఆర్ఎఫ్(311) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు.