ప్రేమలో 'కాలభైరవ - కావ్య'..?
‘బలగం’ బ్యూటీ కావ్య త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు, కాలభైరవతో ఆమె ప్రేమలో ఉన్నా రని, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ ఇటీవల ఓ ఈవెంట్‌లో సన్నిహితంగా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, ఈ పెళ్లి వార్తలపై ఇప్పటి వరకు అధికారికంగా ఎవరు స్పందించలేదు.