పట్టణంలో వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
MDK: తూప్రాన్ పట్టణం సాయి నగర్ కాలనీలో నివాసం ఉండే బేగరి మహేష్ (36) సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. అతడి కోసం చుట్టుపక్కల వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో, మంగళవారం భార్య వందన PSలో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.