VIDEO: సాగర్‌రింగ్ రోడ్డు వద్ద ఆటో డ్రైవర్ల ఆందోళన
హైదరాబాద్ ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డు వద్ద ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. గంటల తరబడి వేచి ఉన్నా ఎల్పీజీ గ్యాస్ లభించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లు ఎల్పీజీ గ్యాస్ కొరతను నిరసిస్తూ హైవేపై ఆటోలను అడ్డంగా నిలిపి నిరసన తెలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్యాస్ సరఫరాను క్రమబద్దీకరించాలని వారు డిమాండ్ చేశారు.