VIDEO: ఏలూరు కాల్వలో గుర్రపుడెక్క
కృష్ణా: లక్ష ఎకరాలకు సాగునీరందించే ఏలూరు కాల్వ గుర్రపుడెక్కతో నిండిపోయింది. గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో కాల్వ చెత్తాచెదారం, గడ్డితో అడవిని తలపిస్తోంది. దీంతో నీటి ప్రవాహం ఆగిపోయి పంటలకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి గుర్రపుడెక్కను తొలగించి, కాల్వను శుభ్రం చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.