ట్రంప్‌తో నెతన్యాహు కీలక చర్చలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడినట్లు ఇజ్రాయెల్ PM నెతన్యాహు తెలిపారు. US సైనిక విజయాల సహకారంతో యుద్ధ లక్ష్యాలను చేరుకుంటామన్నారు. ఇరాన్, లెబనాన్‌పై దాడులు కొనసాగుతాయని, హెజ్‌బొల్లాను అణచివేస్తున్నామని చెప్పారు. ఇటీవలే ఇద్దరు ఇరాన్ అణు శాస్త్రవేత్తలను మట్టుబెట్టినట్లు వెల్లడించారు. ఏ పరిస్థితుల్లోనైనా తమ దేశ ప్రయోజనాలను కాపాడుకుంటామని స్పష్టం చేశారు.