అరకు సమస్యలపై కేంద్రమంత్రికి వినతి

అరకు సమస్యలపై కేంద్రమంత్రికి వినతి

ASR: అమరావతిలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను అరకు టీడీపీ ఇంఛార్జ్ సియ్యారి దొన్ను దొర కలిశారు. ఈమేరకు నియోజకవర్గంలో తీవ్ర తాగునీటి ఎద్దడి, నెట్‌వర్క్ సమస్యలపై వినతిపత్రం అందించారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా గిరిజన గ్రామాల్లో నీటి కష్టాలు తీరలేదని వివరించారు. స్పందించిన మంత్రి.. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.