VIDEO: అధ్వాన్నంగా మారిన ఫ్లైఓవర్ అప్రోచ్ రోడ్డు

VIDEO: అధ్వాన్నంగా మారిన ఫ్లైఓవర్ అప్రోచ్ రోడ్డు

ASF: సిర్పూర్ (టి) మండలం వేంపల్లి సమీపంలోని రైల్వే ఫ్లైఓవర్ అప్రోచ్ రోడ్డు అధ్వాన్నంగా మారింది. ఫ్లైఓవర్ నిర్మించి ఏళ్లు గడుస్తున్నా.. తారు రోడ్డు వేయకపోవడంతో కంకర తేలి ప్రయాణం నరకప్రాయంగా మారింది. వాహనదారులు కంకర, దుమ్ముతో ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు బైక్ అదుపుతప్పి ప్రమాదాలు జరిగినట్లు పేర్కొన్నారు. అధికారులు అప్రోచ్ రోడ్డుకు తారు వేయాలన్నారు.