అమలాపురంలో విద్యార్థినిలకు అవగాహన సదస్సు

కోనసీమ: అమలాపురం మండలం బండారులంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ‘గుడ్ టచ్- బ్యాడ్ టచ్’ పై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వీరబాబు మాట్లాడుతూ.. చిన్నారుల పట్ల ఇటీవల కాలంలో జరుగుతున్న అత్యాచారాల పట్ల తల్లిదండ్రులతో పాటు చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్ఐ శేఖర్ బాబు పాల్గొన్నారు.