VIDEO: సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
PDPL: సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. శుక్రవారం గోదావరిఖనిలోని జీడీకే వన్ టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాలు, గంజాయి, పిల్లల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రామ్ రెడ్డి పాల్గొన్నారు.