ఘోర రోడ్డు ప్రమాదం.. HYD వాసులు మృతి
HYD: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి 42 మంది సజీవదహనమయ్యారు. భారతీయ యాత్రికులు మక్కా నుంచి మదీనాకు వెళ్లి వస్తుండగా ముఫారహత్‌లో ఈ ఘటన జరిగింది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. ఎక్కువగా HYD వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.