పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే చంటి
ELR: ఏలూరు 45, 46వ డివిజన్ పెన్షన్ లైన్, ఆర్చ్ వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే బడేటి చంటి, నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొని, లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. లబ్ధిదారుల సమస్యలను, ఆరోగ్య పరిస్థితులను అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.