విలేజ్ వెల్‌నెస్ సెంటర్ ప్రారంభం

విలేజ్ వెల్‌నెస్ సెంటర్ ప్రారంభం

VZM: నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి భోగాపురం గ్రామంలో విలేజ్ వెల్‌నెస్ సెంటర్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సెంటర్ ద్వారా గ్రామస్థాయి ప్రజలకు తక్షణ ప్రాథమిక ఆరోగ్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. సీజనల్ వ్యాధుల నియంత్రణ, చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు తక్షణ చికిత్స వంటి సదుపాయాలు లభించనున్నాయన్నారు.