ధర్పల్లి పోలీస్ స్టేషన్లో హోలీ సంబరాలు

ధర్పల్లి పోలీస్ స్టేషన్లో హోలీ సంబరాలు

NZB: ధర్పల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్సై సామ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఒకరికొకరు రంగులు పూసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోలీ రంగుల వలె ప్రతి ఒక్కరి జీవితం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో, వేడుకగా పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు.