VIDEO: పోతురాజులతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే

RR: షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట గ్రామంలో చర్ల మైసమ్మ తల్లి బోనాలను ఇవాళ వైభవంగా నిర్వహించారు. బోనాల వేడుకల్లో పోతురాజుల విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ డప్పు చప్పుళ్ల మధ్య పోతురాజులతో కలిసి నృత్యాలు చేశారు. పోతురాజులతో కలిసి చిందులు వేస్తూ నృత్యం చేయడంతో భక్తులు, ప్రజలలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించింది.