పాకిస్తాన్ క్రికెటర్ ప్రపంచ రికార్డ్

పాకిస్తాన్ క్రికెటర్ ప్రపంచ రికార్డ్

పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ ఆఘా సరికొత్త రికార్డు సృష్టించాడు. 2025 క్యాలెండర్ ఇయర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 54 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. దీనితో, ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు 53 మ్యాచ్‌లతో ద్రవిడ్, ధోనీ, పాక్ మాజీ ఆటగాడు మహ్మద్ యూసఫ్ పేరిట ఉండేది.