ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి

ప్రకాశం: మార్కాపురం పట్టణంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరారెడ్డి అనే వృద్ధుడు మృతి చెందాడు. జాతీయ రహదారి దాటుతుండగా, కొనకనమిట్ల వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ మేరకు తీవ్ర గాయాలైన వృద్దుడిని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి, అనంతరం ఒంగోలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు.