VIDEO: రాచాలలో బాల సంస్కార కేంద్రం ప్రారంభం..
MBNR: అడ్డాకుల మండలం రాచాలలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో బాల సంస్కార కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో బాలబాలికలకు శ్లోకాలు, భగవద్గీత, రామాయణం, దేశభక్తుల చరిత్ర, భజనలు వంటి విషయాలు వారానికి ఒక గంట బోధించనున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులకు రామాయణ పోటీలకు సంబంధించిన పత్రాలను అందజేశారు.