'దివ్యాంగ శక్తి' పథకం ప్రారంభించిన కలెక్టర్

'దివ్యాంగ శక్తి' పథకం ప్రారంభించిన కలెక్టర్

W.G: భీమవరం ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం 'దివ్యాంగ శక్తి' పథకాన్ని కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభించారు. 40 శాతానికి పైగా వైకల్యం ఉన్నవారు 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని వారు వివరించారు. దివ్యాంగులకు సముచిత స్థానం కల్పించాలనే సదుద్దేశంతోనే ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు