నేడు జిల్లాలో మంత్రి పర్యటన
SDPT: సిద్దిపేట జిల్లాలో ఈరోజు మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటిస్తున్నట్లు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఉ. 10 గంటలకు గజ్వేల్ ఐఓసి భవనంలో, 11 గంటలకు సిద్దిపేట ఐడిఓసి భవనంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ, మ. 12 గంటలకు అక్బర్ పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ పెద్ద చెరువులో చేప పిల్లలను వదులుతున్నట్లు తెలిపారు.