కాంగ్రెస్ ప్రభుత్వం షాబాద్ వైపు చూడండి: కవిత

కాంగ్రెస్ ప్రభుత్వం షాబాద్ వైపు చూడండి: కవిత

RR: జాగృతి జనం బాటలో భాగంగా షాబాద్‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేరుకొని బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుల, మతాలకు అతీతంగా బీసీ రిజర్వేషన్ సాధన కోసం 40 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ నాయకులు షాబాద్ వైపు చూడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.