కొమరోలులో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కొమరోలులో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ప్రకాశం: జిల్లా కొమరోలు మండలంలో ఈ రోజు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు శనివారం ప్రకటించారు. మరమ్మత్తుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బాధనేనిపల్లి, సూరవారి పల్లి, బొడ్డువానిపల్లి, రామవారి పల్లి, గుంతపల్లి, బెడుసుపల్లి, పోసుపల్లి, రెడ్డిచర్ల గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని తెలిపారు.