బొండపల్లి మండలంలో 70 ఎమ్మెల్సీ ఓట్లు

బొండపల్లి మండలంలో 70 ఎమ్మెల్సీ ఓట్లు

VZM: బొండపల్లి మండలంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్లు 70 ఉన్నట్లు తాసిల్దార్ నాదస్వరం తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బొండపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఓటర్లకు తగిన మాములుగా సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు.