కొత్తపాలెంలో వైభవంగా జరిగిన ధ్వజ స్తంభం ప్రతిష్ట

కొత్తపాలెంలో వైభవంగా జరిగిన ధ్వజ స్తంభం ప్రతిష్ట

ప్రకాశం: పొన్నలూరు మండలం కొత్తపాలెంలో నేడు రామాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. రెండు రోజుల నుంచి గ్రామంలో పురోహితుల మంత్రోత్సవాల మధ్య గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సోమవారం ధ్వజ స్తంభంతో పాటు బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్థులు ఈ సందర్భంగా జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు.