'మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు'

ప్రకాశం: పొన్నలూరు మండలంలో మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే చర్యలు తప్పవని ఎస్ఐ అనూక్ హెచ్చరించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నిబంధనల మేరకు వాహనాలు నడపాలన్నారు. లైసెన్స్ కలిగిఉండి, హెల్మెట్ ధరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపైనా చర్యలు తీసుకుంటామన్నారు.