ఎన్నికలకు దూరంగా లెబనాన్
ఇరాన్‌కు మద్దతుగా హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. ప్రతీకారంగా లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో లెబనాన్‌లో పరిస్థితులు మరింత దిగజారాయి. ఆర్థిక సంక్షోభం, భద్రతా సమస్యలతో విసిగిపోయిన ప్రజలు ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని భావించిన ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేసింది.