అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్
SRD: సంగారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పి. ప్రావీణ్య ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. బాధితుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఆమె, పెండింగ్‌లో ఉన్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.