అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు విరాళం

అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు విరాళం

NDL: బనగానపల్లె మండలం, నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఇవాళ పొద్దుటూరు పట్టణానికి చెందిన అనిత కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు 50,116 రూపాయల నగదును ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను ఇచ్చారు.