ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ అశోక్ రెడ్డి

BDK: మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు ఉన్నందున అశ్వాపురం మండల ప్రజలు అప్రమతంగా ఉండాలని సీఐ అశోక్ రెడ్డి అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని సూచించారు. అటు ఉధృతంగా ప్రవహించే వాగులు, నదులను దాటే ప్రయత్నం చేయవద్దని చెప్పారు. అత్యవసర సమయంలో డయల్ 100 కు ఫోన్ చేయాలని సూచించారు.