VIDEO: ఒగ్గు పూజారులతో కలిసి డబరు వాయించిన మాజీ మంత్రి
WGL: పర్వతగిరి మండలం గోపనపల్లి గ్రామంలో దూడల మల్లన్న జాతర ఘనంగా జరిగింది. శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒగ్గు పూజారులతో కలిసి డబురు వాయించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాతరలో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ వాతావరణాన్ని సృష్టించారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు.