ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
SRPT: జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్‌లో వివిధ పోటీ పరీక్షల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ తెలిపారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ఈ నెల 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 8న నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా 100 మందిని ఎంపిక చేసి ఐదు నెలల పాటు ఉచిత వసతితో శిక్షణ ఇస్తారనీ అన్నారు.