రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ప.గో: తణుకు పట్టణ పరిధిలోని ఉండ్రాజవరం జంక్షన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా లొల్ల గ్రామానికి చెందిన మట్టా సత్యనారాయణ (38) తన స్నేహితుడితో కలిసి శనివారం తాడేపల్లిగూడెం నుంచి బైక్‌పై స్వగ్రామానికి వెళుతుండగా అదుపుతప్పి లారీ కింద పడ్డారు. ఈ ప్రమాదంలో సత్యనారాయణ ఘటన స్థలంలోనే మృతి చెందారు.