మంత్రి పదవి రావాలని పూజలు

BHNG: రాజపేట మండలం రఘునాథపురానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే బిర్లా ఐలన్నకి మంత్రి పదవి రావాలని యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....ఐలన్న సేవలు మరువలేనివన్నారు. బిర్లా ఫౌండేషన్ ద్వారా అంబులెన్స్ ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడారని పేర్కొన్నారు.